హోమ్

6, మే 2019, సోమవారం

నయా నేషనలిజం



"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా"
"నువ్వు ఈ దేశం లో పుట్టి పెరిగావా?"
"అవును"
"నువ్వు ఈ దేశ పౌరుడివేనా?"
"కాదు"
"అయితే నీకీ పాట పాడే అర్హత లేదు"
"అరె నేను ఇక్కడే ఉంటున్నా, పని చేస్తున్నా, పన్నులూ కడుతున్నా"
"ఐనా సరే, నీకా అర్హత లేదు"
"మరి, షెహజాదా, రాజ మాత .."
"ఏం పర్లేదు, మాకు విదేశీ పాలన అలవాటే, నువ్వు మాత్రం ఈ దేశాన్ని ప్రేమించకూడదు"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకర్ధం అయ్యింది"
"నువ్వు ఏ పార్టీ వాడివో నాకూ అర్ధం అయ్యింది"
"నాకు ఓటు హక్కు కూడా లేదు, ఇంకా పార్టీ ఏమిటి? నేను విపత్తు సమయాల్లో, ప్రజల కోసం చాలా విరాళాలిచ్చాను"
"అవన్నీ నువ్వు నా దేశం లో పన్ను లు ఎగ్గొట్టానికి చేసిన జిమ్మిక్కులు"
"నువ్వు నిజం గా దేశభక్తుడివేనా?"
"అది నీకనవసరం, కానీ నువ్వు మాత్రం  ఈ దేశాన్ని ప్రేమించడానికి వీల్లేదు"

---- ఈ మధ్య ఓ నటుడి పౌరసత్వం గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ ప్రభావం

4 కామెంట్‌లు:

  1. మీ నేషనలిజం అర్ధం అయింది. మదర్ ధెరెస్సానే గౌరవించని జాతి మీది. మేకులు కొట్టడం అలవాటయిన పార్టీ మీది. నయా దేశభక్తులూ మీరే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ,
      విషయానికి సంబంధించి మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు.
      గతం లో వ్యాఖ్య ల మాడరేషన్ ఈ-మెయిలు వచ్చేది, కాని గూగుల్ ప్లస్ అంతరించాక, బ్లాగ్ లో ఏదో లోపం వల్ల, నాకు వ్యాఖ్య లకి సంబంధించి ఈ-మెయిలు రాలేదు, అందుకే చూసుకోడం మిస్ అయ్యి, ప్రచురించ లేక పోయాను. ఇప్పుడే ఆ సెట్టింగ్ కరెక్టు చేసుకున్నాను.
      మీ వ్యాఖ్య విషయం పవన్ గారి బ్లాగ్ లో చూసి తెలుసుకుని, వెంటనే చెక్ చేసి, ప్రచురించాను అంతే కాని "కూసే ధైర్యం చేతల్లో లేక పోవడం" వల్ల కాదు.
      ఒకింత తొందరగా మీరు నా వ్యక్తిత్వాన్ని (తప్పుగా) అంచనా వేసి, అలా ప్రకటించడం కించిత్ బాధాకరం.

      తొలగించండి
    2. మీ బ్లాగులో ఇంత విలయ విద్వంసం జరిగిందని ఊహించలేకపోయాను. తేటగీతి బ్లాగర్ లాగా నా వ్యాఖ్యలు ప్రచురించలేదని వ్రాసాను. క్షమించండి.

      తొలగించండి
    3. “విద్వంసం“ పదంలో ద కు ఒత్తు ఉండాలి కదా :)

      తొలగించండి