హోమ్

3, జనవరి 2024, బుధవారం

గాయం

 


డెందం గాయపడుతోంది,
నువ్వు దూరమైపోతున్నందుకు.
హృదయం చిద్ర మౌతోంది,
ఆ దూరానికి కారణం నేనే అవుతున్నందుకు.
శక్తి యుక్తులు మోహరించి,
లెక్క లేనన్ని యత్నాలు,
నీ మనసు తలుపు మళ్ళీ తట్టేందుకు.
మనసు మరింత జారి పోతోంది,
నువ్వు ఇంకా దూరం జరుగుతున్నందుకు.
వీటన్నిటిని మించి, మెలిపెట్టే బాధ,
ఒక్క మొయిని మనసుకు ఉరేసి పోతోంది,
నీ ప్రతి చర్యా సబబే అనిపిస్తున్నందుకు.