హోమ్

1, ఫిబ్రవరి 2016, సోమవారం

తెలుగు వెలుగు లో నా కవిత

నేను ఏదైనా వ్రాయగలను అని నేను పదో తరగతి కొచ్చేవరకూ నాకే తెలియదు. నా స్నేహితుడొకడు నన్ను ఏడిపించడానికి ఒక కవిత వ్రాసి ఇచ్చాడు. ఉడుకుమోత్తనంతో నేనూ వాడి పై ఒక తవిక బరికేసాను. తొంభయ్యవ దశకం లో  చాలామంది మధ్య తరగతి టీనేజ్ పిల్లల్లాగే నేనూ కమ్యూనిస్ట్ భావాలకి దగ్గరయ్యాక, మరి కొద్దిగా వ్రాయడం మొదలైంది. చుట్టూ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నాయ్ అంటున్నా, నా తవికలు ఎప్పుడూ ప్రచురణార్హమైనవి అనుకోలేదు. తొంభై ఏడు లో ఆలిండియా రేడియో విజయవాడ కి తప్ప ( ప్రసారమయ్యాయి కూడాను), ఎప్పుడూ ఏ పత్రికకీ పంప లేదు. వ్రాసిన ఇరవై ఏళ్ళకి, ఈ మధ్య మా నాన్న గారు చొరవ తీసుకుని పంపిస్తే, తెలుగు వెలుగు వాళ్ళు అచ్చేసి, యాభై రూపాయలు కూడా పంపారు.

ఆ 'కవనం' అనే తవిక లంకె ఇక్కడ. 

http://ramojifoundation.org/flipbook/201601/magazine.html#/20

ఈ తవిక చూసి నాలాగే మీకు నవ్వొస్తే, మీ తప్పు కాదు. చలం చెప్పినట్లు చాలా వాటికి క్షమించాలి నన్ను.



4 కామెంట్‌లు:

  1. తవిక అని చెప్పుకున్నందుకు నీకు అభినందనలు. పడికట్టు మాటలతో వ్రాసిన ఇటువంటి తవికలు చూచి చూసి విసుగెత్తిపోయింది. ఎమైనా పత్రికవారికి నచ్చిందికదా. ఐతే ఓకే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇంతకంటే మంచివి కూడా పంపించారు కానీ వాళ్ళు ఇదే వేశారు. నాకూ అంతగా నచ్చలేదు.

      తొలగించండి