హోమ్

18, జూన్ 2012, సోమవారం

లెజెబ్రిటీ

                       "నేను టివి లో రాబోతున్నానోచ్" అని వసంత ఫేసుబుక్ లో పెట్టిన స్టేటస్ మెసేజి కి డెబ్భై లైకులూ, ముప్ఫై  కామెంట్లూ చ్చాయి. వసంత "దంచి కొట్టు దుమ్ము లేపు" రియాలిటీ షో లో టివి లో కనబడబోతోంది. ఆ పోటీ లో పాల్గొనేవాళ్ళూ, జడ్జీలూ జుట్టూ జుట్టూ పట్టుకొని కొట్టుకోవడాలూ, బండబూతులు తిట్టుకోవడాలూ, పరస్పరం చేసుకునే ఛాలెంజీ లు వెరసి ఆ  షో మొదలైన వెయ్యి వారాల్లోనే నంబర్ వన్ షో అయ్యింది. అసలు ఆ  ప్రోగ్రాము యాంకర్ చీత్కార్ అన్నయ్య యాంకరింగే పెద్ద హైలైటు. ప్రసారం అయ్యే రోజు తెలియగానే మళ్ళీ ఫేసుబుక్ లో అప్ డేట్ చేసింది. మళ్ళీ చాలా  కామెంట్లూ , లైకులూనూ.అందరూ తెగ ఎదురుచూస్తున్నారు ప్రోగ్రాము కోసం. వసంత ఆ టైముకి కరెంటు కోత ఉండకుండా చూడమని కోటి దేవుళ్ళకి మొక్కింది.
                      ప్రోగ్రాము చూసిన వాళ్ళందరూ తెగ మెచ్చేసుకున్నారు వసంతని. ఆడియన్సు లో కూర్చున్న వసంత సర్కస్ ఫీట్ల  లాంటి డాన్సులు చూసి ఇచ్చిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. మొత్తం మూడు సెకండ్లు వున్న తన వీడియో ని యూట్యూబ్ లో పెట్టింది. అర గంట లో ఇరవై మంది చూసిన ఆ  వీడియో ఒక  పెద్ద సంచలనం  రేపుతుందని  చీత్కార్  అన్నయ్య  కూడా ఊహించలేదు.ఇలాంటి వార్తలే   ప్రసారం చేసే టివి 29 వాళ్ళు, ఆ వీడియో ని రోజంతా చూపించడం తో పాటు వసంత  సెలెబ్రిటీ నో లెజెండో తేల్చుకోలేక  లెజెబ్రిటీ అని తీర్మానించేసారు.
                  "రేపు టివి 29 లో నా ఇంటర్వ్యూ యోచ్" అని వసంత పెట్టిన స్టేటస్ మెసేజి కి మళ్ళీ విపరీతమైన లైకులూ, కామెంట్లూనూ.

8 కామెంట్‌లు:

  1. title and content... highly hilarious, yet, absolutely correct also.

    రిప్లయితొలగించండి
  2. బాగా నవ్వుకొన్నాను. పద ప్రయోగాలు బాగున్నాయి. వర్తమాన పరిస్థితులను నువ్వు విశ్లేషిస్తున్న తీరు బాగుంది. మరిన్ని మంచి పద ప్రయోగాల కోసం ఎదురు చూస్తున్నా.

    రిప్లయితొలగించండి
  3. కామెంటినందుకు నెనర్లు @narayana

    రిప్లయితొలగించండి