మీరిచ్చిన లింకులో మీ "అక్షరఘోష" కథ చదివాను మాధవ్ గారూ. భ్రష్టు పట్టిపోతున్న తెలుగు ఉచ్చారణ గురించిన మీ ఆవేదన వినూత్న శైలిలో వ్రాసిన ఈ కథలో కనబడింది. మీ బ్లాగ్ లో ఈ టపా ఇంతకు ముందు నేనెలా గమనించలేదో అర్ధం కావడంలేదు.
"పన్నారి" బ్లాగ్ లో మీ వ్యాఖ్యలో మీరు ఉదహరించిన ఒత్తులతో పాటు "భ", "ధ" వగైరాలకు కూడా జనం విశ్రాంతి ఇచ్చినట్లే తోస్తోంది - ఎక్కువగా ఆడవాళ్ళు (కొంతమంది మహిళా టీచర్లు కూడా బహుశ ఇలాగే ఉండుంటారు. వాళ్ళే స్కూల్లో విద్యార్ధులకి, ఇంట్లో తమ స్వంత పిల్లలకి గురువులు కూడానూ మరి 🙁). కొంత వరకు సినిమాలు, ఇప్పుడు మీడియా కారణం అనిపిస్తోంది. "బార్యాబర్తల బందం" అంటూ సంభాషణలు చెప్పే నటీమణుల్ని చూసాం.
టీవీ ఏంకర్లు కూడా ఏమీ తక్కువ తినలేదు. అసలు గట్టిగా మూడు నాలుగు కన్నా ఎక్కువ అక్షరాలున్న తెలుగు పదాలను పలకడానికి పడే అవస్థ చూస్తుంటే ఈ గతి పట్టిందా అని బాధ వేస్తుంది. అది కాక ఇంగ్లీష్ మోజొకటి. మాట్లాడేదాంట్లో 90 శాతం ఇంగ్లీష్ పదాలే. లేదా హిందీ పదాలు. అసలు అదే ఫేషన్ అనీ, స్టైల్ అనీ వాళ్ళ భ్రమనుకుంటాను. నిన్నటికి నిన్న ఒక తెలుగు ఏంకరిణి "ఆమ్" (హిందీ) అంటూ చాలాసార్లు అంది. తరువాత ఒక్కసారి "ఆమ్ అంటే .... " అంది. "మామిడికాయ" అంటుందిలే అనుకున్నాను. కాదు, "ఆమ్" అంటే "మాంగో" అని చెప్పి మనకి జ్ఞానోదయం కలిగించింది. నాకైతే నిన్నటి తరం నటుడు కీ.శే. సుత్తి వీరభద్రరావు గారిలాగా చొక్కా చింపేసుకోవాలనిపించింది 🙁.
ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చనుకోండి. ఏతావాతా తెలుగు భాషకు పట్టిన దురవస్ధ చూస్తుంటే దిగులుగా ఉంటుంది - ఈ భాష ఎంతకాలం బతికుంటుందా అని (pidgin లా తయారవకుండా) 🙁.
విన్నకోట వారు, కథ చదివినందుకు ధన్యవాదాలు. కొన్నేళ్ళుగా టివి, సినిమా మాధ్యమాలే కాక,ఇంటా బయటా కూడా ఇలాంటి భాష వినీ, వినీ విసుగెత్తి వ్రాశాను. ఈ మధ్య ఓ ఫంక్షను లో కొంత మంది పిల్లలు "వరవీనా మ్రిదు పానీ, వనరుహ లోచన రాని" అని పాడుతుంటే విని, దేశం కాని దేశం (యు.కె) లో మన పాట ఇంకా నేర్చుకుంటున్నందుకు ఆనందించాలో, లేక ఉచ్ఛారణా దోషాలతో పాడుతున్నందు బాధ పడాలో తెలియలేదు. ఇదొక క్రొత్త మాండలీకం అని సర్దుకుపోవాలేమో.
కొత్త మాండలీకం 😀😀. అంటే ఆ పిల్లలకి నేర్పించిన వారి ఉచ్చారణా రీతి కూడా అంతే అయ్యుండాలి. లేదా పిల్లలు సరిగ్గా పలకలేకుంటే పెద్దలు సకాలంలో సరిదిద్దలేదన్నమాట. ఇక మీరన్నట్లు ఖండాలు దాటినా మన పాట ఆ మాత్రమన్నా పాడేవారున్నారని సంతసించాలి.
బుచికోయమ్మ బుచికి. బాగుంది
రిప్లయితొలగించండి@అజ్ఞాత ధన్య వాదాలు. బుచికోయమ్మ బుచికి అనడం లో అర్ధం బోధపడలేదు.
తొలగించండిమీరిచ్చిన లింకులో మీ "అక్షరఘోష" కథ చదివాను మాధవ్ గారూ. భ్రష్టు పట్టిపోతున్న తెలుగు ఉచ్చారణ గురించిన మీ ఆవేదన వినూత్న శైలిలో వ్రాసిన ఈ కథలో కనబడింది. మీ బ్లాగ్ లో ఈ టపా ఇంతకు ముందు నేనెలా గమనించలేదో అర్ధం కావడంలేదు.
రిప్లయితొలగించండి"పన్నారి" బ్లాగ్ లో మీ వ్యాఖ్యలో మీరు ఉదహరించిన ఒత్తులతో పాటు "భ", "ధ" వగైరాలకు కూడా జనం విశ్రాంతి ఇచ్చినట్లే తోస్తోంది - ఎక్కువగా ఆడవాళ్ళు (కొంతమంది మహిళా టీచర్లు కూడా బహుశ ఇలాగే ఉండుంటారు. వాళ్ళే స్కూల్లో విద్యార్ధులకి, ఇంట్లో తమ స్వంత పిల్లలకి గురువులు కూడానూ మరి 🙁). కొంత వరకు సినిమాలు, ఇప్పుడు మీడియా కారణం అనిపిస్తోంది. "బార్యాబర్తల బందం" అంటూ సంభాషణలు చెప్పే నటీమణుల్ని చూసాం.
టీవీ ఏంకర్లు కూడా ఏమీ తక్కువ తినలేదు. అసలు గట్టిగా మూడు నాలుగు కన్నా ఎక్కువ అక్షరాలున్న తెలుగు పదాలను పలకడానికి పడే అవస్థ చూస్తుంటే ఈ గతి పట్టిందా అని బాధ వేస్తుంది. అది కాక ఇంగ్లీష్ మోజొకటి. మాట్లాడేదాంట్లో 90 శాతం ఇంగ్లీష్ పదాలే. లేదా హిందీ పదాలు. అసలు అదే ఫేషన్ అనీ, స్టైల్ అనీ వాళ్ళ భ్రమనుకుంటాను. నిన్నటికి నిన్న ఒక తెలుగు ఏంకరిణి "ఆమ్" (హిందీ) అంటూ చాలాసార్లు అంది. తరువాత ఒక్కసారి "ఆమ్ అంటే .... " అంది. "మామిడికాయ" అంటుందిలే అనుకున్నాను. కాదు, "ఆమ్" అంటే "మాంగో" అని చెప్పి మనకి జ్ఞానోదయం కలిగించింది. నాకైతే నిన్నటి తరం నటుడు కీ.శే. సుత్తి వీరభద్రరావు గారిలాగా చొక్కా చింపేసుకోవాలనిపించింది 🙁.
ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చనుకోండి. ఏతావాతా తెలుగు భాషకు పట్టిన దురవస్ధ చూస్తుంటే దిగులుగా ఉంటుంది - ఈ భాష ఎంతకాలం బతికుంటుందా అని (pidgin లా తయారవకుండా) 🙁.
విన్నకోట వారు, కథ చదివినందుకు ధన్యవాదాలు. కొన్నేళ్ళుగా టివి, సినిమా మాధ్యమాలే కాక,ఇంటా బయటా కూడా ఇలాంటి భాష వినీ, వినీ విసుగెత్తి వ్రాశాను. ఈ మధ్య ఓ ఫంక్షను లో కొంత మంది పిల్లలు "వరవీనా మ్రిదు పానీ, వనరుహ లోచన రాని" అని పాడుతుంటే విని, దేశం కాని దేశం (యు.కె) లో మన పాట ఇంకా నేర్చుకుంటున్నందుకు ఆనందించాలో, లేక ఉచ్ఛారణా దోషాలతో పాడుతున్నందు బాధ పడాలో తెలియలేదు. ఇదొక క్రొత్త మాండలీకం అని సర్దుకుపోవాలేమో.
తొలగించండికొత్త మాండలీకం 😀😀. అంటే ఆ పిల్లలకి నేర్పించిన వారి ఉచ్చారణా రీతి కూడా అంతే అయ్యుండాలి. లేదా పిల్లలు సరిగ్గా పలకలేకుంటే పెద్దలు సకాలంలో సరిదిద్దలేదన్నమాట.
రిప్లయితొలగించండిఇక మీరన్నట్లు ఖండాలు దాటినా మన పాట ఆ మాత్రమన్నా పాడేవారున్నారని సంతసించాలి.