ఆకాశవాణి విజయవాడ వారి భావచిత్రాలు (30/11/1997) లో ప్రసారమైన కవిత.
భావచిత్రాల్లో రెండు పంక్తులు ఇస్తారు. వాటిని ఉపయోగిస్తూ ఒక వచన కవిత వ్రాయాలి.
"పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?"
ఈ పంక్తులని ఉపయోగిస్తూ నేను పంపిన కవిత ఇది. ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలతో.
స్వాగతించరేం?
మార్చేయండి మానవ నైజాన్ని,
తిరగరాయండి మానుష చరిత్రని.
ఇదిగో, ఇక్కడ,
బూజు పట్టిన విధానాల్ని దులుపుకుంటూ,
నిశి రాత్రిని వెన్నెలగా చూపే
గాజు కళ్ళని నులుముకుంటూ,
అర్ధశతాబ్ది స్వాతంత్ర్యాన్ని
ఆనందంగా హత్తుకుంటూ,
దారిద్ర్యపు వెలుగులో
గత వైభవాన్ని చూసుకుంటూ,
రాజకీయుల వాగ్దానాలని
తృప్తిగా నెమరేసుకుంటూ ,
గుండె గాయాల్ని
వైప్లవ్య గేయాలుగా మార్చుకుంటూ,
సమరశంఖం పూరిస్తూ ,
గర్జిస్తూ ,
ప్రశ్నిస్తున్నాను.
పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని ?
మూగనేలకి నీరందివ్వని వాగు పరుగు దేనికని?
చైతన్యం కోసం ప్ర్రాణమివ్వని యువత శౌర్యమెందుకని?
బదులివ్వరేం?
భావిభారత బంగరు కలలని భుజానేసుకుని,
గంపెడాశతో వస్తున్నాను.
స్వాగతించరేం?
అభినందనలతో మీ కవితని స్వాగతించాం 😊
రిప్లయితొలగించండిధన్యవాదాలు లలిత గారు. ఇరవైయ్యెళ్ళ క్రితం నేను రాసిన కవితల్లో, ఇప్పటికీ నేను ఏకీభవించగలిగిన అతి కొద్ది వాటిల్లో ఇదొకటి. చాలా వాటిని చూసి ఇప్పుడు నవ్వుకుంటున్నాను. అప్పుడు రాసింది నేనేనా అని.
తొలగించండిMee Bhavan Chala bagundi
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండి