జోగినాధం లండన్ లో పని చేసే రోజుల్లో ఆఫీసు లో ఒకతను ( పైనోడు, అంటే రామ్ భాషలో ఉత్తరాది వాడు అని) ఇటలీ గురించి తెగ పొగిడేవాడు. ఎప్పుడూ పిజ్జానో, పాస్తానో తినేవాడు. అతగాడి వైఖరి తో విసుగొచ్చి జోగి ఒకరోజు
"రోజూ పాస్తా, పిజా తిన్నంత మాత్రాన ఇటాలియన్ అయిపోవు" అన్నాడు "మరి?" "శాండో నో సుమో నో అవుతావు" "ఇటాలియన్ అవ్వాలంటే ఏమి చెయ్యాలో?" అన్నాడతను వ్యంగ్యంగా. "తెలుగు, తెలుగు లో మాట్లాడాలి" "????" "తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు, కాబట్టి తెలుగు మాట్లాడితే, మీ రోటీ లు తింటూనే ఎంచక్కా సగం ఇటాలియన్ అయిపోవచ్చు" సూక్ష్మం చెప్పాడు జోగి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి