పని లేని బిజీ రావు అసహనం గా ఛానెళ్ళు మారుస్తూ టివి ముందు కూర్చున్నాడు.
- టివి 29 : డెంటెడ్ అండ్ పెయింటెడ్ ముఖర్జీ గారి వ్యాఖ్యల మీద కొందరు అరుచుకుంటున్నారు.
- టివి 55 : దోశా రావణ్ పాపి స్వామి వారు స్త్రీ రక్షణ గురించి అనుగ్రహ భాషణం మీద కొందరు కరుచుకుంటున్నారు.
- దోషి టివి: మంత్రి గారు "క్రైములు మనకి చెప్పి చేస్తారా వాటిని ఎలా ఆపగలం" అని నాలిక కరుచుకున్న వైనం పై కాంచిపురపు బబ్రహ్మణ్యం కామెడీ షో.
- మీ టివి2: వస్తున్నా పదవి కోసం యాత్ర పై స్పెషల్ కవరేజి.
- బిబిఎన్ తెలుగు జ్యోతి: తెలుగు యువ కిశోరం పీకేష్ బాబు ట్వీట్లు, లోక కళ్యాణం పై రచ్చ ..సారీ చర్చ
సామాజిక నిస్పృహ కొంచెం ఎక్కువే వున్న బిజీ రావు కి ఇవన్నీ కొత్తగా అనిపించలేదు. ఇంత వయొలెంట్ వి కాకుండా కాస్త అమ్మయిలని, పువ్వులని చూద్దామని మళ్ళీ ఛానెల్ మార్చాడు. ఇప్పుడు:
- మీ మ్యూజిక్: పక్కనే ఉన్న మీ ఫ్రెండ్సు కి మెస్సేజీ సెండ్ చెయ్యాలనుకుంటున్నరా అయితే ఇప్పుడే కాల్ చెయ్యండి అంటూ తెలుగు అమ్మాయి తెగులు గా ఆహ్వానిస్తోంది.
వెంటనే రావుకి పక్కనే ఐపాడు లో కూత లు వింటూ ఊగిపోతున్న తన గాళ్ ఫ్రెండు లేహ్య గుర్తు వచ్చింది.వెంటనే లేహ్య కి ఒక మెస్సేజి పంపి, ఒక పాట ని డెడికేట్ చేసాడు.
- శోకిని మ్యూజిక్: త్వరలో రాబోయే కామిని ఎస్సెమ్మెస్స్ 2 గురించి కాల్ ఇన్ ప్రోగ్రాం విత్ డోక్తా కపూర్ తెలుగు డబ్బింగు.
ఎస్సెమ్మెస్స్ అనగానే తను ఎస్సెమ్మెస్స్ చెక్ చేసుకుని ముప్ఫై సెకన్లు దాటి పోయిందని గ్రహించి వెంటనే మొబైల్ ఆన్ చేసాడు. ఇరవై ఏడు మెసేజీలు వెయిటింగ్. వాటిలో తనకి బాగా నచ్చిన ఎస్సెమ్మెస్స్ తన బడ్డీ రామకోటేశ్వర్రావు అలియాస్ రాక్ నుంచి:ఫేస్ బుక్ లో నా స్టేటస్ నచ్చక పోతే లైక్ చెయ్యి, నచ్చితే షేర్ చెయ్యి, ఏదీ కాకపోతే కామెంట్ చెయ్యి. వెంటనే ఫేస్ బుక్ లో వాడి స్టేటస్ చూసాడు.
"ఫోన్ లో ఫేస్ బుక్ చూసుకుంటూ నడుస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళ ఆరడుగుల గోతి లో పడ్డా హిహిహి" ఇదీ వాడి స్టేటస్. వెంటనే లైక్ చేసి, కామెంటి, వీడిని ఎవరైనా పైకి తీశారో లేదో అనుకుని, తీస్తే వాడే స్టేటస్ అప్డేట్ చేస్తాడ్లే అనుకుంటూ మళ్ళీ టివి పై దృష్టి సారించాడు.
- శోకిని టివి: విస్తరాకులు కాంపిటీషన్ - విస్తరాకులు సీరియల్ కోటి ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లో హీరోయిన్ ఏడుస్తూ కాఫీ కలుపుతున్నప్పుడు ఎన్ని కన్నీటి చుక్కలు కప్పులో పడ్డాయి? మీ సమాధానాన్ని ఫలానా నెంబర్ కి పంపండి ఆ కప్పు ని గెలుచుకోండి.
ఈ రోజు మన సమాజం లో చాలా మంది వెర్బల్ డయేరియా (నోరు పారేసుకోవడం) అనే వ్యాధి తో బాధ పడుతున్నట్లు అనిపిస్తోంది. మాట ని ఇష్టం వచ్చినట్లు వాడడం పరిపాటి అయ్యింది. పంచ్ డైలాగు (మాట) ల వల్ల రేంజి పెరిగిన హీరోలున్నారు అలానే మాట వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళూ వున్నారు. మాటల యుద్ధాల్ని ప్రసారం చేసే చానెళ్ళ రేటింగులు పెరుగుతున్నాయి. టివి, ఇంటర్నెట్ , సోషల్ నెట్ వర్క్స్, ఫోన్ ఇలా అన్నీ ఈ మాటలని మనకు చేరుస్తున్నాయి.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవా:, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి:, జిహ్వాగ్రే మరణం ధ్రువం
మాట మనిషి కి మాత్రమే వున్న శక్తి. మాట వల్ల ఏమైనా సాధించవచ్చు. దురదృష్ట వశాత్తూ మాట ని ఎలా వాడుకోవాలో, వాడుకోకూడదో చెప్పే చదువులు ఈనాడు మనకు లేవు.
సులభా: పురుషా రాజన్ సతతం ప్రియవాదిన: | అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ:||
మారీచుడు రావణుడి తో అన్నట్లు, ప్రియమైన మాటలు చెప్పేవాళ్ళు సులభం గానే దొరుకుతారు, కాని మంచి మాటలు చెప్పే వాళ్ళు అంత సులభం గా దొరకరు, దొరికినా వినేవాళ్ళు వుండరు.
- టివి 29 : డెంటెడ్ అండ్ పెయింటెడ్ ముఖర్జీ గారి వ్యాఖ్యల మీద కొందరు అరుచుకుంటున్నారు.
- టివి 55 : దోశా రావణ్ పాపి స్వామి వారు స్త్రీ రక్షణ గురించి అనుగ్రహ భాషణం మీద కొందరు కరుచుకుంటున్నారు.
- దోషి టివి: మంత్రి గారు "క్రైములు మనకి చెప్పి చేస్తారా వాటిని ఎలా ఆపగలం" అని నాలిక కరుచుకున్న వైనం పై కాంచిపురపు బబ్రహ్మణ్యం కామెడీ షో.
- మీ టివి2: వస్తున్నా పదవి కోసం యాత్ర పై స్పెషల్ కవరేజి.
- బిబిఎన్ తెలుగు జ్యోతి: తెలుగు యువ కిశోరం పీకేష్ బాబు ట్వీట్లు, లోక కళ్యాణం పై రచ్చ ..సారీ చర్చ
- మీ మ్యూజిక్: పక్కనే ఉన్న మీ ఫ్రెండ్సు కి మెస్సేజీ సెండ్ చెయ్యాలనుకుంటున్నరా అయితే ఇప్పుడే కాల్ చెయ్యండి అంటూ తెలుగు అమ్మాయి తెగులు గా ఆహ్వానిస్తోంది.
- శోకిని మ్యూజిక్: త్వరలో రాబోయే కామిని ఎస్సెమ్మెస్స్ 2 గురించి కాల్ ఇన్ ప్రోగ్రాం విత్ డోక్తా కపూర్ తెలుగు డబ్బింగు.
"ఫోన్ లో ఫేస్ బుక్ చూసుకుంటూ నడుస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళ ఆరడుగుల గోతి లో పడ్డా హిహిహి" ఇదీ వాడి స్టేటస్. వెంటనే లైక్ చేసి, కామెంటి, వీడిని ఎవరైనా పైకి తీశారో లేదో అనుకుని, తీస్తే వాడే స్టేటస్ అప్డేట్ చేస్తాడ్లే అనుకుంటూ మళ్ళీ టివి పై దృష్టి సారించాడు.
- శోకిని టివి: విస్తరాకులు కాంపిటీషన్ - విస్తరాకులు సీరియల్ కోటి ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ రోజు ఎపిసోడ్ లో హీరోయిన్ ఏడుస్తూ కాఫీ కలుపుతున్నప్పుడు ఎన్ని కన్నీటి చుక్కలు కప్పులో పడ్డాయి? మీ సమాధానాన్ని ఫలానా నెంబర్ కి పంపండి ఆ కప్పు ని గెలుచుకోండి.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్ర బాంధవా:, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి:, జిహ్వాగ్రే మరణం ధ్రువం
మాట మనిషి కి మాత్రమే వున్న శక్తి. మాట వల్ల ఏమైనా సాధించవచ్చు. దురదృష్ట వశాత్తూ మాట ని ఎలా వాడుకోవాలో, వాడుకోకూడదో చెప్పే చదువులు ఈనాడు మనకు లేవు.
సులభా: పురుషా రాజన్ సతతం ప్రియవాదిన: | అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ:||
మారీచుడు రావణుడి తో అన్నట్లు, ప్రియమైన మాటలు చెప్పేవాళ్ళు సులభం గానే దొరుకుతారు, కాని మంచి మాటలు చెప్పే వాళ్ళు అంత సులభం గా దొరకరు, దొరికినా వినేవాళ్ళు వుండరు.
chaala baagundi
రిప్లయితొలగించండిబాగుంది మాధవ్ గారు.
రిప్లయితొలగించండిమాధవ్ చాల బాగుంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు కిషోర్ గారు
రిప్లయితొలగించండిజాస్మిన్ గారు బ్లాగు కి స్వాగతం, ధన్యవాదాలు.
Good post
రిప్లయితొలగించండిహల్లొ మాధవా,
రిప్లయితొలగించండిఎదొ 'సాఫ్ట్ వేరు ' వాడివి అయ్యిపోయావు, సాఫ్ట్ గా అయ్యిపొయుంటావు అనుకున్నాను. కలము
పడితే అదే చురుకు అదే వ్యంగం అదే వేగం అదే తెలుగుదనం. నీ బ్లాగ్ ని ఎదో అనుకొకుండా చదివాను. చాలా బాగా రాస్తున్నావు. నీలొ కవిని కాపాడినందుకు ధన్యవాదములు.
మహెష్
@మహేష్ బ్లాగు కి స్వాగతం. నచ్చినందుకు నెనర్లు.
రిప్లయితొలగించండినెనర్లు. ante enti..??
రిప్లయితొలగించండి@Mahesh Thanks ani ardham
రిప్లయితొలగించండి