మన ప్రజల కష్టాలన్నిటికీ రాముడే కారణం. ఋజువు ఇదిగో..
రావణ సంహారం తర్వాత , రాజ్యాధికారం వచ్చాక, రాముడి తో అడవి నుంచి వచ్చిన వానర సేన కి రాముడు ఏదైనా కోరుకొమ్మని వరం ఇచ్చాడట. రాముని వైభవం చూసి ఆ వానర సేన 'రామా! మాకునూ మీవలే రాజ్యాధికారం చెలాయించాలని వున్నదీ' అని కోరుకున్నవి. కలియుగం లో మీ కోరిక నెరవేరుతుందని రాముడు వరం ఇచ్చాడట.
ఆ కట్టు కథ కట్ చేస్తే... ఆనాడు రామునికి సాయం చేసిన ఆ కోతిమూక, పదవుల కోసం యధాశక్తి పార్టీలు దూకుతూ ఇప్పుడు ప్రజలకి ద్రోహం చేస్తోంది.
మిగతా దూకుళ్ళని తక్కువ చెయ్యటం కాదు కానీ.. మన రాష్ట్రం లో నాకు బాగా నచ్చిన 3 దూకుళ్ళు:
1) సినిమాలో బంగీ జంప్ చేసిన మెగాస్టార్ రాజకీయాల్లోనూ చెయ్యగలనని నిరూపించాడు తన ఎమ్మెల్యే ల తో సహా కాంగ్రెస్ లోకి దూకి. ప్రజలు కోరుకున్నారట ఈయన దూకాడట.
2) ఎం వి మైసూరా రెడ్డి: కాంగ్రెస్ లో వుండగా బిగ్ బాస్ వివాదం తో చంద్రబాబు ని ఇరుకున పెట్టి, అదే చంద్రబాబు పార్టీ లోకి జంప్ చేసి తాజాగా లక్ష కోట్ల లెక్కలు చెప్పి జగన్ పై రాళ్ళు రువ్వి వెంటనే అదే జగన్ పార్టీలోకి జంప్ చేసారు. మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడో?
3) దేవేందర్ గౌడ్: ఎన్.టి.ఆర్ నీడలో పెరిగి, బాబు తో జత కట్టి నంబర్ టూ గా చలామణీ అయ్యి, తెలంగాణా ప్రజలు కోరుకున్నారని చారిత్రాత్మకం గా ఒక పార్టీ పెట్టి,
మళ్ళీ ప్రజలు కోరుకున్నారని చారిత్రాత్మకం గా ప్రజారాజ్యం లో విలీనం చేసి, భంగ పడి మళ్ళీ ప్రజల కోరిక మేరకు , రాష్ట్ర చారిత్రాత్మక అవసరాల కోసం బాబు పంచన చేరాడు. పదవి కోసం ఎన్ని చారిత్రాత్మక దూకుళ్ళ కైనా సిద్ధం.
అసలు ఈ దూకుళ్ళ కి అంతే లేదు. ఈ దూకుడు రాయుళ్ళకి (రాణులకి కూడ) గురు తుల్యులు ఎవరైనా వున్నారు అంటే అది దేవిలాల్, చంద్రశేఖర్ లాంటి జాతీయ నాయకులే అని చెప్పాలి. దేవిలాల్ స్టైలే వేరు. యాభై ఏళ్ళలో ఈయన దూకిన పార్టీ లు 11. ఈయనే రాజకీయ మెగాస్టార్ .
కాంగ్రెస్
ఫ్రోగ్రెస్సివ్ ఇండిపెండెన్స్ ఫార్టీ
కాంగ్రెస్
హర్యానా కాంగ్రెస్
కాంగ్రెస్
కిసాన్ సంఘర్ష్ సమితి
భారతీయ లోక్ దళ్,
జనతా పార్టీ
హర్యానా సంఘర్ష్ సమితి
దళిత్ మజ్దూర్ కిసాన్ పార్టీ
జనతా దళ్
ఉన్నత పదవులు పొందటానికి దూకడం రాజకీయాల లోనే కాదు, ఉద్యోగాలలోనూ వుంది. అసలు గిరీశం తప్పు చెప్పాడు, పొగ తాగని వాడు కాదు, తెగ దూకని వాడు దున్నపోతై పుట్టున్ అనిఉండాల్సింది..
'అంతా నువ్వే చేసావు' అని రాముడి ఫోటో వైపు చూస్తూ అనాలని ఎవరికైనా అనిపిస్తే అది మీ తప్పు కాదు..
భలే రాసారండి! రాజకీయాలలోకి కేవలం స్వార్ధం కోసం అడుగుపెట్టి ఎలాగైనా సరే పదవులు సంపాదించుకుని, తద్వారా తర తరాలకు తరగని సిరిసంపదలు సంపాదించుకోవాలన్న వారి కోరిక , ఆశయం నెరవేరాలంటే మరి ఆ మాత్రం దూకుడు ఉండొద్దాండి చెప్పండి? ఒక సిద్ధంతానికి కట్టుబడి పని చేసే వారు లేకపోవటం మన దురద్రుష్టం. రాముడే దీవించి ఇచ్చిన వరం కాబట్టీ, రాముడిదే భారం అని ఒక దండం పెట్టి సరిపెట్టేదామా?
ఎక్కడ ఎవరికి ఎవరితో ప్రయోజనాలున్నాయో ఆ ప్రకారం గోడ దాటేస్తున్నారు... నమ్మకం =(న్+అమ్మ+కం ) నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి కంఫర్టబిలిటి ని చూసుకుంటున్నారు....
ఎక్కడ ఎవరికి ఎవరితో ప్రయోజనాలున్నాయో ఆ ప్రకారం గోడ దాటేస్తున్నారు... నమ్మకం =(న్+అమ్మ+కం ) నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి కంఫర్టబిలిటి ని చూసుకుంటున్నారు...
Thank U Madhav... U don't know ME... But I know to the extent about U through Narayana....Nice to meet U with this blog... the way you are dealing the current affairs as well as others, is nice...
ఈ దూకుడు సాటి ఎవ్వరు ?? వర్తమాన రాజకీయాలు ఇలాగే వున్నాయి
రిప్లయితొలగించండిభలే రాసారండి!
రిప్లయితొలగించండిరాజకీయాలలోకి కేవలం స్వార్ధం కోసం అడుగుపెట్టి ఎలాగైనా సరే పదవులు సంపాదించుకుని, తద్వారా తర తరాలకు తరగని సిరిసంపదలు సంపాదించుకోవాలన్న వారి కోరిక , ఆశయం నెరవేరాలంటే మరి ఆ మాత్రం దూకుడు ఉండొద్దాండి చెప్పండి? ఒక సిద్ధంతానికి కట్టుబడి పని చేసే వారు లేకపోవటం మన దురద్రుష్టం. రాముడే దీవించి ఇచ్చిన వరం కాబట్టీ, రాముడిదే భారం అని ఒక దండం పెట్టి సరిపెట్టేదామా?
ధన్యవాదాలు @వెన్నెల గారు.
రిప్లయితొలగించండినెనర్లు @నారాయణ
ఎక్కడ ఎవరికి ఎవరితో ప్రయోజనాలున్నాయో ఆ ప్రకారం గోడ దాటేస్తున్నారు...
రిప్లయితొలగించండినమ్మకం =(న్+అమ్మ+కం ) నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి కంఫర్టబిలిటి ని చూసుకుంటున్నారు....
ఎక్కడ ఎవరికి ఎవరితో ప్రయోజనాలున్నాయో ఆ ప్రకారం గోడ దాటేస్తున్నారు...
రిప్లయితొలగించండినమ్మకం =(న్+అమ్మ+కం ) నమ్మకాన్ని అమ్మకానికి పెట్టి కంఫర్టబిలిటి ని చూసుకుంటున్నారు...
@siva rama krishna గారు నా బ్లాగు కి స్వాగతం. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిThank U Madhav... U don't know ME... But I know to the extent about U through Narayana....Nice to meet U with this blog... the way you are dealing the current affairs as well as others, is nice...
రిప్లయితొలగించండి